ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు : సీఎం రేవంత్ ఆగ్రహం
అభయహస్తం దరఖాస్తుల అమ్మకాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష చేపట్టారు. దరఖాస్తులను ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు అవసరమైనన్ని దరఖాస్తులను ప్రజాపాలనలో అందుబాటులో ఉంంచాల్సిందేనని స్పష్టం చేశారు. మరోవైపు రైతు భరోసా, పింఛన్లపై అపోహలు వద్దని, పాత లబ్దిదారులందరికీ యథాతథంగా వస్తాయని చెప్పారు. కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారే వీటికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.













