Arangur- Zoo Park :ఆరాంఘర్- జూపార్క్ పైవంతెను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

ఆరాంఘర్-జూపార్కు (Arangur- Zoo Park) పైవంతెనను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy )ప్రారంభించారు. హైదరాబాద్ నగరం నుంచి బెంగళూరు(Bangalore) హైవేకు ఉన్న ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు జూపార్కు నుంచి ఆరాంఘర్ వరకు 4.08 కిలోమీటర్ల పొడవునా దాదాపు రూ.800 కోట్లతో ఈ పైవంతెనను బల్దియా నిర్మించింది. గతేడాది డిసెంబరులో ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేసినా కొన్ని కారణాల వల్ల నిలిచిపోయింది. ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా సుమారు రూ.800 కోట్లతో చేపట్టిన జూపార్క్- ఆరాంఘర్ పైవంతెన పీవీ ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్ (PV Express Flyover) తర్వాత నగరంలో రెండో అతిపెద్ద వంతెన.