కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆఫర్..డిప్యూపీ సీఎంతో!

పంట రుణాల మాఫీ పథకాన్ని సమర్థంగా అమలు చేసే జిల్లాల కలెక్టర్లకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లంచ్ ఆఫర్ ప్రకటించారు. అయితే అది తనతో కాదు, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతో. రుణమాఫీని సమస్యలు లేకుండా అమలయ్యేలా చేసిన టాప్-3 జిల్లాల కలెక్టర్లు ఉప ముఖ్యమంత్రితో కలిసి మధ్యాహ్న భోజనం చేయవచ్చన్నారు. నాతో కూడా భోజనం చేయొచ్చు. కానీ నా దగ్గర డబ్బులు ఉండవు. డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ కూడా అయినందున ఆయనతో భోజనం చేయడంతో పాటు జిల్లాలకు సంబంధించిన నిధులు కూడా తీసుకెళ్లొచ్చు అని సీఎం రేవంత్ చమత్కరించినట్లు సమాచారం.