యాదాద్రికి సీఎం కేసీఆర్ ?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించనున్నట్లు తెలుస్తోంది. కరోనా నుంచి క్షేమంగా కోలుకున్నందున తన ఇష్టదైవం నృసింహుడికి ప్రత్యేక పూజలు చేయడమే కాకుండా, ఆలయ విస్తరణ, పునర్నిర్మాణ పనులు పరిశీలించడానికి ఈ పర్యటన ఉంటుందని అంటున్నారు. రెండు, మూడు రోజుల్లో యాదాద్రి వచ్చి లక్ష్మీ నృసింహుడిని దర్శించుకోనున్నట్లు సమాచారం. కొవిడ్ ఉదృత్తి దృష్ట్యా కేవలం కొద్ది మంది ముఖ్యులు మాత్రమే ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఈ పర్యటనలో పాల్గొంటారని తెలుస్తోంది.