మే 7 దాకా విమాన ప్రయాణికులు రాకండి
తెలంగాణలో లాక్డౌన్ పూర్తయ్యేదాకా విమాన ప్రయాణికులెవ్వరూ తెలంగాణకు రావొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ సృష్టం చేశారు. మే 4 నుంచి విమాన సర్వీసులు ఉంటాయని ఆయా కంపెనీలు ప్రకటిస్తున్నాయి. నాలుగో తేదీ నుంచి బుకింగ్ చేస్తామని వార్తలు వస్తున్నాయి. విమాన ప్రయాణికులకు కూడా మనవి చేస్తున్న. దయచేసి మే 7 దాకా తెలంగాణకు రాకండి. వచ్చినా మీకు ట్యాక్సీ ఉండదు. క్యాబ్ ఉండదు. హోటల్ ఉండదు. ఏమీ ఉండదు. చాలా కష్టమవుతది. జీఎమ్మార్ వాళ్లకు కూడా చెప్తం. మే 7 వరకు ఇవన్నీ ఫాలో కావాల్సిందే. ఒక్కసారి తెరిస్తే మళ్లీ మనకు ఇబ్బంది అవుతుంది అని కేసీఆర్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో లాక్డౌన్ పూర్తయ్యేవరకు విమానయాత్రికులను రానివ్వబోమని పేర్కొన్నారు.













