గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్ భేటీ
గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో ఆయన సమావేశమయ్యారు. గవర్నర్‌ను బడ్జెట్ సమావేశాలకు సీఎం ఆహ్వానించారు. ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి మండలి ఆమోదించిన గవర్నర్ ప్రసంగ ప్రతిని తమిళిసైకు సీఎం అందజేశారు. దీంతో పాటు వివిధ అంశాలపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం. ప్రత్యేకంగా కరోనా వైరస్ నియంత్రణ, ముందు జాగ్రత్తలకు తీసుకుంటున్న చర్యలను గవర్నర్‌కు సీఎం కేసీఆర్ వివరించినట్లు తెలిసింది.













