రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
రంజాన్ పర్వదినం నేపథ్యంలో ముస్లిం సోదర సోదరీమణులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిలిపారు. ఈద్ ఉల్ ఫితర్ పర్వదిన వేడుకలను సంతోషంగా జరుపుకోవాలన్నారు. పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని సీఎం ఆకాంక్షించారు. రంజాన్ మాసం క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందన్నారు. గంగా జమునా తెహజీబ్కు తెలంగాణ ప్రతీక అని పేర్కొన్నారు. లౌకికవాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రభుత్వం తమ సామరస్యాన్ని కాపాడుతుందని అన్నారు.













