ఘనంగా సీఎం కేసీఆర్ దత్త పుత్రిక వివాహం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష పెళ్లి ఘనంగా జరిగింది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాటిగడ్డ లూర్దుమాత చర్చిలో ప్రత్యుష, చరణ్ రెడ్డిలు ఒక్కటయ్యారు. ఈ వేడుకకు షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్, మహిళ సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజుతో పాటు పలువురు ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
ప్రత్యూషకు పెళ్లి కానుకగా సీఎం సతీమణి శోభమ్మ అరుదైన బహుమతిని అందజేశారు. నిన్న ప్రత్యూషను పెండ్లి కూతురుగా ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమానికి శోభమ్మ హాజరై ప్రత్యూషకు పట్టు వస్త్రాలు, వజ్రాల నెక్లెస్ బహుకరించి ఆశీర్వదించారు. అమెతో పాటు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు.













