ఇసీ సంచలన నిర్ణయం …
తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల రాజకీయ ప్రకటనలను నిలిపివేస్తూ సిఇఓ ఆదేశాలు జారీ చేశారు. అన్ని చానళ్లు, సోషల్ మీడియా ఛానళ్లకు సిఇఓ లేఖలు రాసినట్లు తెలిపారు. అసెంబ్లీ సాధారణ ఎన్నికల కోసం స్టేట్ లెవెల్ సర్టిఫికేషన్ కమిటీ ఆమోదించిన రాజకీయ ప్రకటనలు దుర్వినియోగం అవుతున్నాయని పేర్కొన్నారు. ఇష్టానుసారంగా మార్చి ప్రసారం చేస్తూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘిస్తున్న కారణం గా ఆ ప్రకటనలను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం వెల్లడించింది. ఆ ప్రకటనల ప్రసారాలను వెంటనే నిలిపి వేయాలని ఛానళ్లకు సూచించింది. ప్రకటనలకు సంబంధించిన కొన్ని వీడియో, క్లిప్‌లను కూడా జతపరచినట్లు సిఇఓ కార్యాలయం తెలిపింది.













