అందుకే కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించలేం : కేంద్రం
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు కింద చేర్చడానికి అర్హత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ టుడు ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2016, 2018లో సీఎం కేసీఆర్, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానిని కోరారని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు తీసుకోలేదని స్పష్టం చేశారు. అనుమతులుంటే కాళేశ్వరాన్ని హైపర్ స్టీరింగ్ కమిటీ పరిశీలించాలి, హై పవర్ కమిటీ అనుమతిస్తే ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కాళేశ్వరానికి పెట్టుబడుల అనుమతులు కూడా లేవని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది.













