కేంద్ర సర్వీసుల్లోకి మరో అధికారి!
తెలంగాణ క్వాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి పౌసమీ బసు సెంట్రల్ స్టాఫింగ్ స్కీంలో భాగంగా కేంద్ర సర్వీసులకు వెళుతున్నారు. కేంద్ర హోమంత్రిత్వ శాఖలో ఆమెను డైరెక్టర్గా నియమిస్తూ డీఓపిటీ (కేంద్ర సిబ్బంది శిక్షణా, వ్యవహారాలశాఖ) నిర్ణయించింది. ఆమె కేంద్ర సర్వీసుల్లో ఐదేళ్లపాటు కొనసాగనున్నారు. తక్షణమే ఆమె తెలంగాణ సర్వీసులను నుంచి రిలీవ్ కావాలని, కేంద్ర హోంశాఖలో అప్పగించిన బాధ్యతలను స్వీకరించాలని డీఓపీటీ పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచారం పంపింది. అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్న మూడు వారాల్లోగా ఆమె విధుల్లో డీఓపిటీ డైరెక్టర్ రంజిత్ కుమార్ లేఖలో స్పష్టం చేశారు.













