మహాగణపతిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఖైరతాబాద్ మహాగణపతిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు కేంద్ర మంత్రిని ప్రత్యేకంగా ఆహ్వానించి పూజలు చేయించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ నాయకురాలు మాధవీలత, ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.