మంత్రి గంగుల, ఎంపీ రవిచంద్రకు.. సీబీఐ నోటీసులు
ఢిల్లీ లో అరెస్టయిన నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్‌కు సంబంధించిన కేసులో తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, టీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లో జరిగే విచారణకు హాజరు కావాలని సూచించారు. అరెస్ట్ అయిన నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్, మంత్రి కమలాకర్‌తో టచ్‌లో ఉన్నట్లు సీబీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. తనకు ఉన్న పరిచయాల ద్వారా గ్రానైట్ వ్యవహారాలకు సంబంధించిన కేసులో ఉపశమనం వచ్చేలా శ్రీనివాస్ ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కరీంనగర్‌లోని మంత్రి ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లారు. శ్రీనివాస్‌తో సంబంధాలు, ఎవరెవరితో మాట్లాడారు. తదితర అంశాలపై గంగుల కమలాకర్, వద్దిరాజు రవిచంద్ర వాంగ్మూలం నమోదు చేసేందుకే నోటీసులు ఇచ్చినట్లు సీబీఐ వెల్లడిరచింది.













