ముగిసిన సినారె అంత్యక్రియలు
ప్రముఖ కవి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి అంతక్రియలు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి. సాహితీ శిఖరాన్ని కడసారి చూసేందుకు పెద్దసంఖ్యలో కవులు, రచయితలు, భాషాభిమానులు తరలివచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు మంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, నాయిని నర్సింహారెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంత్యక్రియాల్లో పాల్గొన్నారు. అంతకుముందు బొగ్గులకుంటలోని సారస్వత్ పరిషత్ నుంచి సినారె అంతిమయాత్ర చేపట్టారు. అంతిమయాత్రలో వేలాది మంది పాల్గొని సినారెకు తుది వీడ్కోలు పలికారు.













