కేంద్రం నిరూపిస్తే.. బీఆర్ఎస్ ఎంపీలంతా రాజీనామా
కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ఒక్క పైసా కూడా ఇవ్వలేదని బీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్శరరావు లోక్‌సభలో వెల్లడించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా నామా మాట్లాడుతూ కేంద్రం నిధులు ఇచ్చినట్లు నిరూపిస్తే బీఆర్ఎస్ ఎంపీలంతా రాజీనామా చేస్తామన్నారు. బీజేపీ ఎంపీలు అబద్ధం చెప్పారన్నారు. తొమ్మిదేళ్లుగా తెలంగాణకు కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోంది. విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ఉక్కు కర్మాగారం, కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం ఏర్పాటు చేయాల్సి, ఉన్నా పట్టించుకోలేదు. పైగా మహారాష్ట్ర, గుజరాత్‌లలో కోచ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారు. ప్రగతిబాటలో పయనిస్తున్న తెలంగాణకు కేంద్రం ఇప్పటికైనా బాసటగా నిలిస్తే మరింత అభివృద్ధి చెందుతాం అని అన్నారు.













