సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రకాశ్ గౌడ్
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే (బీఆర్ఎస్) ప్రకాశ్ గౌడ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. రేవంత్ సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. దీనితో ప్రకాశ్ గౌడ్ బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ప్రచారం జరిగింది. దీనిని ప్రకాశ్‌గౌడ్ ఖండించారు. తాను మర్యాదపూర్వకంగానే సీఎం రేవంత్‌తో భేటీ అయ్యానని ప్రకాశ్ గౌడ్ పేర్కొన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజేంద్రనగర్ నియోజకవర్గం లోని శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ, బహదూర్‌గూడ ఘాన్నిమియాగూడ గ్రామాల్లో భూసంబంధ సమస్యల పరిష్కారం కోసమే సీఎంను కలిశానని తెలిపారు.













