ఆ మూడు పార్టీలు కలిసి పోటీ చేయడానికి.. రంగం సిద్ధం
టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి పోటీ చేయడానికి రంగం సిద్ధమని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో నిఘా వ్యవస్థ నిద్రపోతోందా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ కుట్రలో భాగంగానే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పై దాడి చేశారని ఆరోపించారు. అభ్యర్థుల ముసుగులో ఎంఐఎం, టీఆర్ఎస్, కాంగ్రెస్ గూండాలు విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. ఘటనపై సీఎం కేసీఆర్, హోంమంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అగ్నిపథ్‌పై చర్యచకు సిద్ధం ట్విటర్ పక్షి వస్తారా? అని ప్రశ్నించారు.













