ఎమ్మెల్సీ కవిత దీక్షకు పోటీగా.. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దీక్షకు పోటీగా హైదరాబాద్లో దీక్ష చేపట్టేందుకు బీజేపీ సిద్ధమైంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహిళా బిల్లు కోసం ఎమ్మెల్సీ కవిత దీక్ష చేపడుతుండగా ఆమెకు ధీటుగా హైదరాబాద్లో బీజేపీ మహిళా మోర్చా నేతలు రాష్ట్రంలోని బెల్టు షాపులు, మహిళలపై హత్యలు, అత్యాచారాలను నిరసిస్తూ దీక్ష చేయనున్నారు. ఈ దీక్షలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణతో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొననున్నారు.













