దుబ్బాక..8, 9వ రౌండ్లలో మళ్లీ బీజేపీనే ఆధిక్యం…
దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్లో ఇప్పటి వరకూ ఎనిమిది రౌండ్లు పూర్తయ్యాయి. ఎనిమిదో రౌండ్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ప్రస్తుతం 621 అధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తానికి చూస్తే మొదటి ఐదు రౌండ్లలో బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉండగా, ఆరో రౌండ్, ఏడో రౌండ్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగడంతో ఇదే పరిస్థితి తుదిపరి రౌండ్లోనూ కొనసాగుతుందని అందరూ అనుకున్నారు. కానీ సీన్ మళ్లీ రివర్స్ అయ్యింది. 3,106 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి కొనసాగుతున్నారు. 9వ రౌండ్లో బీజేపీకే ఆధిక్యం వచ్చింది. 1084 ఓట్లు ఈ రౌండ్లో బీజేపీ అభ్యర్థికి వచ్చాయి. ఇప్పటి వరకు 4,190 ఓట్ల అధిక్యంలో బీజేపీ అభ్యర్థి ఉన్నారు.













