నిజంగా ప్రేమ ఉంటే… 2.5 శాతం వదులుకోవచ్చు కదా? : లక్ష్మణ్
కాంగ్రెస్‌కు ఓటేస్తే టీఆర్ఎస్కు ఓటేసినట్లేనని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ మోదీ, బీజేపీని ఎదుర్కొనేందుకు గుంపులుగా వస్తున్నారన్నారు. చేనేత రంగంపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించిందంటూ టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై ఆయన మండిపడ్డారు. చేనేత 5 శాతం జీఎస్టీకి తెలంగాణ ఆర్థిక మంత్రి ఒప్పుకొని సంతం చేసింది నిజం కాదా? ప్రశ్నించారు. రూ.20 లక్షల టర్నోవర్‌పై పన్ను కోరుకున్నది మీరు కాదా? అని నిలదీశారు. నిజంగా చేనేత కార్మికులపై ప్రేమ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం 2.5 శాతం పన్ను వదులుకోవచ్చు కదా? అని అన్నారు. ఈ 8 ఏళ్లలో మునుగోడు నియోజకవర్గంలో అదనంగా ఒక్క గుంట భూమికీ నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. నియోజకవర్గం అభివృద్ధి కావాలన్న బీజేపీ అభ్యర్థిని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ప్రజలు గెలిపించాలని కోరారు.













