రోడ్డు ప్రమాదంలో మాజీమంత్రి డికె అరుణ భర్త భరతసింహరెడ్డికి గాయాలు
మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి డికె అరుణ భర్త భరతసింహరెడ్డి గాయపడ్డాడు. ఆయనకు మెరుగైన చికిత్సకోసం హైద్రాబాద్ కు తరలించారు.
బుదవారం మధ్యాహ్నం మహబూబ్ నగర్ జిల్లా మరికల్ మండలం ఎలిగండ్ల వద్ద భరతసింహరెడ్డి ప్రయాణీస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో భరతసింహరెడ్డి గాయపడ్డాడు. ఆయన చేయి విరిగినట్టు వైద్యులు చెబుతున్నారు. మహబూబ్ నగర్ లో ప్రాథమిక చికిత్స నిర్వహించారు.అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆయనను హైద్రాబాద్ కు తరలించారు.
ఇటీవలే ఆయన వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో తృటిలో తప్పించుకొన్నారు. ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు చెబుతున్నారు. విషయం తెలిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయనను చూసేందుకు తరలివస్తున్నారు













