జూన్ 8న చేపప్రసాదం పంపిణీ
మృగశిర కార్తెలో బత్తిని మృగశిర ట్రస్టు ఆధ్వర్యంలో ఏటా బత్తిని సోదరులు పంపిణీ చేసే ప్రసాదం ఈసారి జూన్ 8న ఇవ్వనున్నట్లు ట్రస్టు కార్యదర్శి బత్తిని హరినాథ్‌గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉబ్బసం, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలతో దీర్ఘకాలికంగా బాధపడుతున్న వారికి ఈ ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో 8వ తేదీ ఉదయం 9:30 గంటలకు 32 కౌంటర్ల ద్వారా వితరణ చేపట్టి ఆ మరుసటి రోజు ఉదయం 9:30 గంటలకు ముగించనున్నట్లు వివరించారు. ఇది ముగిశాక చేపలు అందుబాటులో ఉంటే మరుసటి రోజు కవాడిగూడ, దూద్‌బౌలి, కూకట్‌పల్లిలోని తమ నివసాల్లోనూ ప్రసాదం వితరణ చేస్తామని చెప్పారు.













