ఇది ముమ్మాటికీ పిరికిపంద చర్య : బండి సంజయ్
నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్‌పై టీఆర్ఎస్ నాయకులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ సంద్భగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, సీఎం కేసీఆర్ నియంత వైఖరిని ప్రశ్నిస్తే జీర్ణించుకోలేక బౌతిక దాడులకు తెగబడటం సిగ్గు చేటన్నారు. ఇది మూమ్మాటికీ పిరికిపంద చర్య అని మండిపడ్డారు. ప్రజాస్వామ్యవాదులంతా టీఆర్ఎస్ దుశ్చర్యలను ముక్తకంఠంతో ఖండిరచాలని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి. సీఎం కేసీఆర్ పాలనను, టీఆర్ఎస్ నేతల తీరును ప్రజలు అసహించుకుంటున్నారు. అయినా వారిలో మార్పు రాకపోగ ప్రశ్శించే వారిపై భౌతిక దాడులకు తెగబడటం వారి అవివేకానికి నిదర్శనం. టీఆర్ఎస్ నేతల బెదిరింపుకు, దాడులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ప్రజా సమస్యలపై నిలదీస్తూనే ఉంటాం. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరును కొనసాగిస్తూనే ఉంటాం అని అన్నారు.













