రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో.. తెలంగాణలో అన్ని స్థానాలను

ప్రజాహిత యాత్రకు అనూహ్య స్పందన లభిస్తోందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. హుజూరాబాద్‌లోని శాయంపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 350కి పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అన్ని ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటామనే నమ్మకం ఉందన్నారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్, రామగుండం రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ భూములివ్వడం హర్షణీయమన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేసి తీరాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉంది. తెల్ల రేషన్ కార్డు ఉన్నా రూ.500కు గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలులో కోత పెడుతున్నారు. 90 లక్షల వరకు రేషన్‌కార్డు కుటుంబాలుంటే వాటిలో 50 లక్షల కుటుంబాలకు కోత పెట్టడం అన్యాయం. కాంగ్రెస్ , బీఆర్‌ఎస్ కుమ్మకై దొంగాట ఆడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు జరిగాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాగ్, విజిలెన్స్ సంస్థలు తేల్చినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని ప్రశ్నించారు.