ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన మాజీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు రేవంత్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్‌తో పాటు మరికొందరి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశామంటూ రాధాకిషన్ రావు వాగ్మూలం ఇచ్చారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలం చూస్తే.. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్.. ప్రతిపక్షాలపై సైబర్ దాడి చేశారనే విషయం స్పష్టమవుతోంది. దేశ భద్రతకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్‌ను సొంత ప్రయోజనాల కోసం వాడుకున్న కేసీఆర్ ఏ పదవికీ అర్హుడు కాదు. అసలు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? వెంటనే కేసీఆర్, కేటీఆర్‌లను అరెస్ట్ చేసి విచారించాలి’’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.