జాతీయ నాయకత్వంలోకి బండి సంజయ్
బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురికి చోటు దక్కింది. తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను కొత్తగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శులుగా తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, కార్యదర్శిగా సత్యకుమార్ (ఆంధ్రప్రదేశ్)ను కొనసాగించనున్నట్లు వెల్లడిరచింది. అలాగే, పార్టీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా బీఎల్ సంతోష్, సంస్థాగత వ్యవహారాల ఉప ప్రధాన కార్యదర్శిగా శివప్రకాశ్‌ను కొనసాగించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు.













