బాలాపూర్ లడ్డూ వేలం…ఈసారి ఎంత పలికిందంటే?
దేశవ్యాప్తంగా పేరుగాంచిన బాలాపూర్ గణేశుడు లడ్డూ అత్యధిక ధర పలికింది. ఈసారి లడ్డూను తుర్కయాంజల్‌కు చెందిన దాసరి దయానంద రెడ్డి రూ.27 లక్షలకు దక్కించుకున్నారు. ఈ వేలం పాటలో 20 మంది స్థానికులు సహా మొత్తం 36 మంది పోటీపడ్డారు. బాలాపూర్ ఉత్సవ సమితి రూ.1,116తో వేలం పాట ప్రారంభించింది. వేలంపాట కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొంనారు. వేలం పూర్తి కావడంలో బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభమైంది. ప్రత్యేక వాహనంలో విఘ్నేశ్వరుడిని హుస్సేన్ సాగర్‌కు తరలించారు. శోభాయాత్ర చాంద్రాయణగుట్ట, షాలిబండ, ఫలక్‌నుమా, చార్మినార్ మీదుగా హుస్సేన్‌సాగర్‌కు చేరుకుంది.













