బీజేపీకి బాబూమోహన్ గుడ్ బై
బీజేపీకి మాజీ మంత్రి బాబూ మోహన్ రాజీనామా చేశారు. గతకొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల అసంతృప్తిగా ఉన్న ఆయన, తాజాగా గుడ్‌బై చెప్పారు. హైదరాబాదలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు ప్రకటించారు. ఈ సందర్భంగా బాబూ మోహన్ మాట్లాడుతూ పార్టీలోని గ్రూపులతో తనపై విమర్శలు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్ ఎంపీ టికెట్‌ను ఆశించానని, అది ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. జీవితంలో కచ్చితంగా ఒక్కసారైన అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. వేరే పార్టీలో చేరతారా? అని ప్రశ్నించగా, దానిపై ఇంకేమీ ఆలోచించలేదని తెలిపారు.













