ఇంట్లోనే రంజాన్ ప్రార్ధనలు

ముస్లిం సోదరులందరూ రంజాన్ ప్రార్థనలను ఇంట్లోనే చేసుకోవాలని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పిలునునిచ్చారు. తెలంగాణలో లాక్‍డౌన్ విధించిన నేపథ్యంలో అందరూ ఇంట్లోనే ఉండి, కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 13న దేశ వ్యాప్తంగా రంజాన్ వేడుకలు జరగనున్నాయి.