బీఆర్ఎస్ ఇక తెలంగాణకే పరిమితం.. కెసిఆర్ ముందరికాళ్ళకు బంధం వేసిన ఎన్నికల సంఘం
ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టాలని భారత్ రాష్ట్ర సమితి- బీఆర్ఎస్ శర వేగంగా అడుగులు వేస్తుంది.. ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమించడం ద్వారా ఏపీలో బాగా వేయాలనుకుంటుంది. అందుకోసం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ బిడ్డలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా పాల్గొనాలని కెసిఆర్ నిర్ణయించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను దక్కించుకుంటే ఏపీలో పార్టీకి మంచి పేరు వస్తుంది. తద్వారా విభజన కారకుడని తనపై ఉన్న ముద్రను చెరిపేసుకునేందుకు అవకాశం కలుగుతుంది. అందుకే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రాధాన్యత అంశంగా బీఆర్ఎస్ భావిస్తోంది.
అయితే కెసిఆర్ ఆశలపై ఎన్నికల సంఘం నీళ్లు చల్లింది. ఏపీలో బీఆర్ఎస్ రాష్ట్ర హోదాను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2014లో రాష్ట్ర విభజన కంటే ముందు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు అయింది. 2014 కంటే ముందే పలు ఎన్నికల్లో పోటీ చేసింది. దీంతో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందింది.2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా అదే హోదా రెండు రాష్ట్రాల్లో కొనసాగుతూ వచ్చింది. అయితే ఎన్నికల్లో టిఆర్ఎస్ తెలంగాణలో మాత్రమే పోటీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయలేదు. దీంతో ఏపీలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం పూర్తిగా లేకుండా పోయింది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం, పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోవడంతో రాష్ట్ర హోదాను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ ఎన్నికల సంఘం పలుమార్లు లేఖ రాసింది. 2019, 2020, 2021లలో లేఖ ద్వారా వివరణ కోరింది. నేరుగా వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే టిఆర్ఎస్ నుంచి సమాధానం లేదు. నేరుగా వెళ్లి వివరణ కూడా ఇవ్వలేదు. అయితే 2024 ఎన్నికల వరకు ఏపీలో రాష్ట్ర హోదా కంటిన్యూ చేయాలని లేక మాత్రం రాసింది.
కానీ ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఏపీలో టిఆర్ఎస్ రాష్ట్ర హోదాను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఎన్సిపి, టి ఎం సి, సిపిఐల జాతీయ హోదాను కూడా ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ పలు రాష్ట్రాల్లో పగ వేయడంతో ఆ పార్టీకి జాతీయ హోదా దక్కింది. మొత్తానికి దేశవ్యాప్తంగా పాగా వేయాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే ఎన్నికల సంఘం నిబంధనల పేరుతో ఆ పార్టీ ముందరికాళ్ళకు బంధం వేసింది.













