అంగరంగ వైభవంగా అమెరికా అమ్మాయి.. హనుమకొండ అబ్బాయి వివాహం
అమెరికాకు చెందిన అమ్మాయి, తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ అబ్బాయి ఇరువురు వివాహం చేసుకున్నారు. హనుమకొండ సుబేదారిలోని అసుంత భవన్లో హిందు సంప్రదాయం ప్రకారం వైభవంగా వారి వివాహం జరిగింది. హనుమకొండ సూదుల సువర్ణ, సమ్మిరెడ్డి దంపతుల కుమారుడు బస్వంత్ రెడ్డి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అదే కంపెనీలో పని చేస్తున్న అమెరికాకు చెందిన హంఫ్రే బిల్రావు వెరోనిక కుమార్తె ఎలీషాతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారగా, ఇరువురు వివాహం చేసుకున్నారు.













