టీఆర్ఎస్ కు మరో షాక్ …బీజేపీలో చేరిన బాబుమోహన్
టీఆర్ఎస్ పార్టీకి బాబుమోహన్ గుడ్ బై చెప్పారు. గులాబీ గూటి నుంచి కమలం గూటికి చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలిసి ఢిల్లీ వెళ్లిన బాబుమోహన్ బీజేపీలో చేరారు. అసెంబ్లీ రద్దు అనంతరం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 105 మందితో కూడిన తొలి జాబితాలో, అందోల్ సిట్టింగ్ ఎమ్మెల్యే బాబుమోహన్‌ను పక్కన పెట్టారు. బాబుమోహన్ స్థానంలో పాత్రికేయుడు చంటి క్రాంతి కిరణ్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉన్న బాబుమోహన్ ఈరోజు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.













