తెలంగాణలో ఆప్‌కు షాక్
తెలంగాణ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ సెర్చ్ కమిటీ చైర్ పర్సన్ ఇందిరాశోభన్ ఆప్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పదవులకు రాజీనామా చేశారు. అవినీతి పరుడైన సీఎం కేసీఆర్‌తో జతకట్టడంతో మన స్థాపానికి గురయ్యానని, ఆప్ పార్టీ అమీర్ల పార్టీగా మారిందని, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకే రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్‌కు పంపారు. ఆప్ సిద్దాంతానికి వ్యతిరేకంగా దేశంలోనే నంబర్ 1 అవినీతిపరుడైన కేసీఆర్ సభకు రావడంపై తాను మనస్థాపానానికి గురయ్యానని కూడా కేజ్రీవాల్ దృష్టికి తెచ్చానని లేఖలో ఇందిరాశోభన్ పేర్కొన్నారు.













