వరంగల్ వైద్యుడికి అంతర్జాతీయ విశిష్ట పురస్కారం
American Cardiologists Association.. భారతీయ సంతతికి చెందిన అమెరికా కార్డియాలజిస్ట్ (హృద్రోగ నిపుణుల) సమాఖ్య ప్రకటించిన అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట వైద్య సేవలు అందించి లక్షలమందికి హృద్రోగ ప్రాణాపాయ స్థితినుండి కాపాడే సి.పి.ఆర్ ప్రక్రియను సమాజానికి అందించినందుకు విశిష్ట వైద్యసేవా పురస్కారం ను అందిస్తున్నట్లు అమెరికన్ కార్డియాలజిస్ట్స్ అసోసియేషన్ ప్రకటించింది.. ఈ విశిష్ట అవార్డుకు భారతదేశంలో ఇద్దరు వైద్యులను ఎంపికచేసి అమెరికాకు ఆహ్వానించగా ప్రస్తుత కరోనా పరిస్థితుల కారణంగా, ఈరోజు రాత్రి 9.30 గంటలకు జరిగే అంతర్జాల సదస్సులో (వర్చువల్ మీట్) ఈ పురస్కారాన్ని అందచేయనున్నారు.
గత రెండు దశాబ్దాలుగా వరంగల్ జిల్లా ప్రజలకు అనేక వైద్యసేవలు అందించిన ప్రముఖ వైద్యులుగా డాక్టర్ రామక శ్రీనివాస్ కు ఈ పురస్కారం వరించింది. (ఇంకొకరు ఢిల్లీ వైద్యుడు) ఈ సందర్భంగా వరంగల్ ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు డాక్టర్ Vyakarnam Nageshwar వ్యాకరణం నాగేశ్వర్,కార్యదర్శి కపిలవాయి రవీందర్ లు డాక్టర్ Srinivas Ramaka శ్రీనివాస్ ను సన్మానించి అభినందించారు.













