పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో 880 అదనపు అపాయింట్మెంట్లు
పాస్పోర్ట్ సేవలను మరింత వేగవంతం చేయడంలో భాగంగా అదనంగా 880 అపాయింట్మెంట్లను విడుదల చేసినట్టు హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ ఆఫీసర్ దాసరి బాలయ్య పేర్కొన్నారు. ఈ ఆపాయింట్మెంట్స్ ఈ నెల 26 నుంచి 30 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు అపాయింట్మెంట్స్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. దరఖాస్తుదారులు మధ్యవర్తులను ఆశ్రయించి మోసపోవద్దని వివరించారు. హైదరాబాద్ (బేగంపేట, అమీర్పేట, టోలిచౌకీ), కరీంనగర్, నిజామాబాద్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో ఈ అదనపు అపాయింట్మెంట్లను దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.













