సంపూర్ణ చంద్రగ్రహణం నేడే
నేడే సంపూర్ణ చంద్రగ్రహణం. సాయంత్రం 5.18 నిమిషాలకు మొదలై రాత్రి 8.41కు ముగుస్తుంది. 6.22 నిమిషాలకు చంద్రుడు పూర్తిగా గ్రహణం పడతారు. గ్రహణం మొత్తం 76 నిమిషాలపాటు సాగినా, గ్రహణ సమయం మాత్రం 3.23 గంటలపాటు ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ సందర్భంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పలు ఆలయాలను మూసివేస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం ఏకంగా 10 గంటలపాటు మూతపడుతోంది.గ్రహణం వీడాక రాత్రి 8.50 నిమిషాలకు గుడిని తెరిచి ఆలయశుద్ధి నిర్వహిస్తారు. రాత్రి 9.30 నుంచి భక్తులను దర్శనానికి అనుమతి ఇస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మగుడిని ఉదయం 10 గంటలకు వరకు తెరచి ఉంచుతారు. ఆ తర్వాత ఆలయాన్ని మూసి వేస్తారు. శ్రీకాళహస్తిలో మాత్రం ఆలయం తెరిచే ఉంటుంది. గ్రహణ సమయంలోనూ రాహు కేతు పూజలు నిర్వహిస్తారు.













