ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్, నెఫ్ట్ ద్వారా జరిపే లావాదేవీలపై చార్జీలను ఎత్తేయాలని ఎస్బీఐ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్బీఐ యాప్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలు జరిపే ఖాతాదారులకు చార్జీల నుంచి ఊరట లభించనుంది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఎస్బీఐ రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్ విభాగ ఎండీ పీకే గుప్తా మాట్లాడుతూ భారత ప్రభుత్వ విజన్లో భాగమయిన డిజిటల్ ఎకానమీలో భాగమయ్యేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.













