నాకు ప్రాణహాని ఉంది… తుపాకీ కావాలి
భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ భార్య సాక్షి తనకు ప్రాణ హాని ఉందని, లైసెన్స్ తుపాకీ ఇప్పించాలని కోరినట్లు సమాచారం. క్రికెట్ మ్యాచ్‌ల దృష్ట్యా ధోనీ ఇంట్లో ఉండే సమయం చాలా తక్కువ. నా కూతురితో కలిసి నేను మాత్రమే ఇంట్లో ఒంటిగా ఉంటున్నా. ఏదైనా పని కోసం బయటకు వెళ్లాల్సి వచ్చినా ఒక్కదాన్నే వెళ్లాలి. నా భద్రతను దృష్టిలో పెట్టుకునే నాకు లైసెన్స్డ్ తుపాకీ లేదా రివాల్వర్ ఇప్పించాలి అని కోరినట్లు సాక్షి తెలిపింది. 2016లో మహేంద్ర సింగ్ ధోనీ కూడా తుపాకీ కోసం అప్లై చేయగా 9ఎమ్ఎమ్ గన్‌కు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.













