నూతన టెక్నాలజీతో ఉద్యోగాలు
రోజురోజుకు వస్తున్న టెక్నాలజీ ప్రవేశాల వల్ల ఉన్న ఉద్యోగాలు ఊడవని, కొత్తవి స ష్టించబడతాయని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ అన్నారు. ఉద్యోగాలు పోతున్నాయన్న అంశంపై తాను ఈ లాజిక్‌ను మాట్లాడటం లేదని, వాస్తవానికి కొత్త టెక్నాలజీ వచ్చి ఒక ఉద్యోగంపోతే అదనంగా 20 జాబ్‌లు వస్తాయని ఆయన చెప్పారు. గోవా ఐటి పాలసీ 2018 విడుదల సందర్భంగా గోవా ముఖ్యమంత్రి పారికర్‌తో పాల్గొన్న కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఐటీ రంగంలో 40 లక్షల మంది పనిచేస్తున్నారని, అయితే ఇదే పరిశ్రమలో 1.25 లక్షల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారని ఆయన చెప్పారు. నాస్కామ్ నివేదిక ప్రకారం ఆరులక్షల ఉద్యోగాలు కేవలం ఐటీ రంగం ద్వారానే వస్తున్నాయన్నారు. కొత్త డిజిటల్ ఎకోసిస్టమ్ ద్వారా ఉద్యోగాల స ష్టి జరుగుతుందని అన్నారు. ఐటి దిగ్గజాలకు కేంద్రంగా మారిన భారత్‌వైపు ప్రపంచమంతా ఎంతో ఆశగా చూస్తోందని ఆయన చెప్పారు.













