ఎన్నికల ప్రధాన కమిషనర్గా సునీల్ అరోరా!
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్గా ఉన్న సునీల్ అరోరాను ప్రధాన కమిషనర్గా నియమిస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆయన డిసెంబరు రెండో తేదీన ప్రస్తుత ప్రధాన కమిషనర్ ఒ.పి.రావత్ నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. గత సెప్టెంబరులో ఆయన ఎన్నికల సంఘం కమిషనర్గా నియమితులయ్యారు. 1980 బ్యాచ్ రాజస్థాన్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన అరోరా గతంలో సమాచార, ప్రసార, నైపుణ్యాభివృద్ధి శాఖల కార్యదర్శిగా పనిచేశారు. ఆర్థిక, జౌళి శాఖలు, ప్రణాళిక సంఘంలో విధులు నిర్వర్తించారు. పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శిగా, ఇండియన్ ఎయిర్లైన్స్ సీఎండీగా సేవలు అందించారు.













