ఈ నెల 25న ప్రధాని మోదీ అమెరికా పర్యటన
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 25న అమెరికా పర్యటనకు బయలుదేరుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక మోదీ అమెరికా పర్యటనకు వెళ్తుండటం ఇదే ప్రథమం. అయితే అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మోదీలు ఈ నెల 26న తొలిసారిగా సమావేశం కానున్నారు. ఈ భేటీలో హెచ్1బి వీసాల అంశం ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఈ వీసాల జారీని తగ్గించటంపై వ్యక్తమవుతున్న ఆందోళనలను ట్రంప్ దృష్టికి మోదీ తీసుకెళ్లనున్నారు. ప్రాంతీయ భద్రత, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం, అంతర్జాతీయ పరిస్థితులూ చర్చకు రావచ్చని సమాచారం. హిందూ మహాసముద్ర ప్రాంతో సుస్థిరత కొనసాగటానికి భారత్ ప్రాముఖ్యతను గుర్తించిన అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్ భారత్ మా ప్రధాన రక్షణ భాగస్వామి అని ఇప్పుటికే సృష్టం చేశారు. ఆగ్నేయాసియాలో ఉగ్రవాదం విసురుతున్న కొత్త సవాళ్లకు దీటుగా స్పందించే మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు.













