ప్రధాని నరేంద్ర మోదీకి అత్యున్నత పురస్కారం
ప్రధాని నరేంద్ర మోదీ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డును అందుకున్నారు. పర్యావరణ సమతుల్యం కోసం కృషి చేసిన మోదీకి, ఐక్యరాజ్యసమితి అత్యున్నత పురస్కారం ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటరెస్ చేతుల మీదుగా ఈ అవార్డును మోదీ అందుకున్నారు. ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డును స్వీకరించడం సంతోషంగా ఉందని మోదీ అన్నారు. ఈ పురస్కారం భారతీయులకూ గౌరవాన్నిచ్చిందన్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు భారతీయులు కట్టుబడి ఉన్నారన్నారు. పర్యావరణం, విపత్తు రెండింటికీ సంస్కృతితో సంబంధం ఉన్నాయని, పర్యావరణం గురించి మన సంస్కృతి ఆలోచించకుంటే, విపత్తులను నివారించలేమని మోదీ అన్నారు. సబ్ కా సాత్ నినాదంలోనే, ప్రకృతి పరిరక్షణ కూడా ఉందని ప్రధాని తెలిపారు.













