పోర్చుగీస్ తో భారత్ పలు ఒప్పందాలు
పోర్చుగీసుతో భారత్ పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. పోర్చుగీస్ ప్రధాని ఆంటోనియా కోస్టాతో మోడీ సమావేశమయ్యారు. అటవీప్రాంతంలో అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు మోడీ సంతాపం తెలిపారు. ఇరుదేశాల మధ్య బంధం బలోపేతానికి పోర్చుగీసుతో భారత్ పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. పన్నులు, సైన్స్, అంతరిక్షం, యువజన వ్యవహారాలు, క్రీడారంగాల్లో, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సంయుక్త నిధి ఏర్పాటు, నాలుగు మిలియన్ యూరోలతో నిధి ఏర్పాటుకు ఎంవోయు కుదుర్చుకున్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించామని మోడీ తెలిపారు. పరస్పర లబ్ధికి హిందీ-పోర్చుగీస్ డిక్షనరీ ఏర్పాటవుతోందని చెప్పారు.













