లాక్డౌన్ మరో రెండు వారాలు పొడిగింపు
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం మరో రెండు వారాలపాటు లాక్డౌన్ను పొడిగించనుంది. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు ముఖ్యమంత్రులు లాక్డౌన్ను పొడిగించాలని కోరారు. దీంతో కేంద్రం కూడా ఈ సూచనకు సమ్మతించినట్లే కనిపిస్తోంది. కరోనాను కట్టడి చేయడానికి మార్చి 24న ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్డౌన్ను ప్రకటించారు. అయితే ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్ ప్రార్థనల వల్ల దేశంలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇది ఈ నెల 14వ తేదీతో ముగియనుంది. దీంతో పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి లాక్డౌన్ పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే దీనికి సంబంధించి ప్రధానమంత్రి అధికారికంగా నిర్ణయాన్ని ప్రకటిస్తారు.













