కీలక నిర్ణయాలు తీసుకున్న మోదీ క్యాబినేట్
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన నేడు జరిగిన క్యాబినేట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ అంశాలను కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు వెల్లడించారు. ఇందులో మొదటిదది.. ఏడాది పాటు ఎంపిల వేతనాలు, అలవెన్సులు, పెన్షన్లో 30 శాతం కోత విధించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం 1954 చట్టాన్ని సవరించింది. ఇక రెండవది.. ఎంపిలాడ్స్ను రెండు సంవత్సరాల పాటు రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపిలాడ్స్ ద్వారా వచ్చే రూ.7,900 కోట్లతో ఒక నిధిని ఏర్పాటు చేస్తామని తెలిపారు.













