విదేశాల్లో విద్యార్థుల నగదు జమకు పాన్
విదేశాల్లో పిల్లల చదువులకు డబ్బు పంపాలంటే ఇకపై పాన్ వివరాలు ఉండాల్సిందే. ఈ మేరకు ఆర్బీఐ కఠినంగా వ్యవహరించనుంది. 2004లో ప్రవేశపెట్టిన సరళీకృత నగదు జమ పథకం(ఎల్ఆర్ఎస్) కింద కరెంట్ ఖాతాలో 25వేల డాలర్ల(దాదాపు రూ.17 లక్షలు) వరకు లావాదేవీలు జరుపుకోవచ్చు. అందుకు గతంలో పాన్ వివరాలు అడిగేవారు కాదు. లావాదేవీల పరిమితిని కేంద్రం 25వేల నుంచి 2,50,00 డాలర్లకు పెంచుకుంటూ వచ్చింది. ఎల్ఆర్ఎస్ పథకం దుర్వినియోగమవుతున్నట్టు ఆర్బీఐ అధికారులు గుర్తించారు. దీంతో పాన్ వివరాలు ఇవ్వడాన్ని తప్పనిసరి చేస్తూ ఎల్ఆర్ఎస్ నిబంధనలను ఆర్బిఐ కఠినతరం చేయనుంది.













