లాక్డౌన్ను పొడిగించిన రాష్ట్రం …
ఒడిశాలో లాక్డౌన్ను పొడిగిస్తూ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రస్తుతం ఏప్రిల్ 14 వరకు 21 రోజుల లాక్డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే రోజురోజుకి కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ను ఏప్రిల్ 30 వరకు కొనసాగించాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం నవీన్ పట్నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో దేశంలో లాక్డౌన్ను పొడగించిన మొదటి రాష్ట్రంగా ఒడిశా నిలిచింది.ఈ క్రమంలో రైళ్లు, విమానాల సేవలు ఈ నెల ఆఖరు వరకు నిలిపి వేస్తున్నట్లు, జూన్ 17 వరకు విద్యాసంస్థలు మూసివేస్తున్నట్లు సీఎం తెలిపారు.













