నిఘా పెట్టడం సాధ్యం కాదు
ఆధార్ ఆధారంగా వ్యక్తుల వ్యక్తిగత వివరాలపై నిఘా పెట్టడం సాధ్యంకాదని యుఐడిఎఐ మంగళవారం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. దేశంలోని పౌరులకు ఆధార్ కార్డులను జారీ చేసే ఈ సంస్థ‘ఆధార్‌ను నిఘా కోసం వాడుకునేందుకు ఎంతమాత్రం వీలులేదు. వ్యక్తుల వ్యక్తిగత వివరాలను కాపాడేందుకు చట్టంలో ఎన్నో రక్షణ కవచాలున్నాయి. అలాగే ఇందుకు సంబంధించిన బలమైన వ్యవస్థలూ ఉన్నాయి. ఈ రకమైన నిఘాకు కోర్టు అనుమతించినా కూడా అది ప్రభుత్వానికి సాధ్యమయ్యేపని కాదు’అని స్పష్టం చేసింది. వ్యక్తిగత గోప్యత, ప్రాథమిక హక్కు అంటూ ఎన్నో వాదనలు వస్తున్నాయని,ప్రస్తుత ఆన్లైన్ యుగంలో ఏదీ వ్యక్తిగతం కాదని అదనపుసొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తొమ్మిది మంది న్యాయమూర్తులు రాజ్యాంగ బెంచ్‌కు స్పష్టం చేశారు. వ్యక్తి గోప్యతను ప్రాధమిక హక్కుగా కోర్టు పరిగణించినట్టయితే దాని ప్రభావం ఆధార్‌పై తీవ్రంగానే ఉంటుందని ఈ ఏజన్సీ తెలిపింది.













