ఎన్నికల సంఘానికి ఎదురు దెబ్బ
రాజ్యసభ ఎన్నికల్లో నోటా (పైన ఉన్నవారెవరూ కాదు) బటన్ను నొక్కేందుకు అనుమతి ఇస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. రాజ్యసభ ఎన్నికల్లో నోటాను అనుమతించరాదని తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏ ఎం ఖన్విల్కర్, జస్టిస్ డీ వై చంద్రచూడ్ ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. రాజ్యసభ ఎన్నికల్లో నోటాను నిర్దేశించేందుకు ఎన్నికల సంఘాన్ని అనుమతించరాదని తెలిపింది. రాజ్యసభలో రాష్ట్రాల దామాషా ప్రాతినిథ్యం ఉంటుందని వివరించింది. గత రాజ్యసభ ఎన్నికల్లో గుజరాత్ శాసనసభలో కాంగ్రెస్ చీఫ్ విప్ శైలేష్ మనుభాయ్ పర్మార్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలిచ్చింది. ఆ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లలో నోటా ఆప్షన్ను ఎన్నికల సంఘం అనుమతించడాన్ని శైలేష్ ప్రశ్నించారు. వ్యక్తిగత ఓటర్లు ప్రత్యక్ష ఎన్నికల్లో వినియోగించేందుకు నోటాను ప్రవేశపెట్టారని సుప్రీంకోర్టు తెలిపింది.













