నమస్తే అంటే తెలుసా?
సిక్కింలోని భారత్-చైనా సరిహద్దులో నాథూలా ప్రాంతంలో చిరునవ్వులు చిందిస్తూ రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చైనా సైన్యాధికారులకు రెండుచేతులతో నమస్తే అంటూ అభివాదం చేశారు. నమస్తే అంటే ఏమిటో తెలుసా? అని చైనా అధికారులను అడిగారు. దీనికి వారు నైస్ టు మీట్ యు అని జవాబుచ్చారు. దీన్ని చైనా భాషలో ఏమంటారని కేంద్రమంత్రి అడుగగా ని హావో అంటారని వారు చెప్పారు. ఇంగ్లిష్ మాట్లాడిన చైనా అధికారులకు మంత్రి అభినందనలు తెలిపారు. డోక్లాంకు పది కి.మీ దూరంలోని చుంబి లోయలో చైనా రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నట్టు తెలిసిన కొన్నిరోజులకే కేంద్ర మంత్రి పర్యటించడం విశేషం.













